కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా పాజిటివ్

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా టెస్ట్ చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు మాత్రం ఆయనలో కనిపించలేదు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో దౌల్తాబాద్ మండలానికి వెంకట్ రెడ్డి ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొంటున్నారు. అయితే అనారోగ్యం కారణంగా టెస్టులు చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది.

తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోమటిరెడ్డి కోరారు. మరోవైపు ప్రజల మధ్యలో తిరుగుతుండే రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి.

Latest Updates