అమెరికాలో ప్రతి 100 మందిలో ఒకరికి కరోనా

  • 40% పేషెంట్లలో సింప్టమ్స్ లేవు
  • 35 పైగా రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల సంఖ్య
  • జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా వెల్లడి
  •  ప్రస్తుత కేసుల కంటే 10 రెట్లు ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్!

వాషింగ్టన్: అమెరికా.. కరోనా ఉక్కు పిడికిలిలో చిక్కి విలవిల్లాడుతోంది.  కరోనా కేసులు, మరణాల సంఖ్యలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ఇప్పటిదాకా అక్కడ 34 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. సుమారు 1.37 లక్షల మంది చనిపోయారు. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. అమెరికాలో సగటున దాదాపు ప్రతి వంద మందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. అక్కడ వైరస్ తీవ్రత ఎలా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.

చాలా కేసులు గుర్తించలే

ఒకవేళ ఫ్లోరిడా ఒక దేశమయ్యుంటే.. కొత్త కేసుల నమోదులో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచేదని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా చెబుతోంది. మొత్తం కేసుల్లో 10 స్థానంలో ఉండేదని వెల్లడిస్తోంది. అమెరికా మొత్తం జనాభా 33 కోట్లు కాగా.. నమోదైన కేసులు 34 లక్షలు పైనే. ఆ లెక్క ప్రకారం చూస్తే సగటున ప్రతి 100 మందిలో ఒకరికి వైరస్ సోకింది. ఇక గత వారంతో పోలిస్తే ప్రస్తుతం 35కు పైగా రాష్ర్టాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికాలో ఇప్పటిదాకా రిపోర్ట్ అయిన కేసుల కంటే 10 రెట్లు ఎక్కువ మందికి కరోనా సోకి ఉంటుందని ఎక్స్ పర్టులు అంచనా వేస్తున్నారు. చాలా కేసులను గుర్తించలేదని చెబుతున్నారు. అమెరికాలో కరోనా సోకిన వారిలో సుమారు 40 శాతం మందికి సింప్టమ్స్ లేవని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ అంచనా వేసింది.

యువకులే ఎక్కువ

ఓవైపు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా జనాలు బయట తిరగడం మానలేదు. సోషల్ గ్యాదరింగ్స్, బార్లకు వెళ్లడం కొనసాగిస్తున్నారు. దీంతో ఎక్కువగా యువకులే ఇప్పుడు వైరస్ బారిన పడుతున్నారు. ఆదివారం (అక్కడి టైం ప్రకారం) లూసియానాలో 1300 కొత్త కేసులు నమోదైతే.. అందులో 99 శాతం కమ్యూనిటీ స్ప్రెడ్ ద్వారా సోకినవే. వీటిలో 30 శాతంపైగా కేసులో 29 ఏళ్లలోపు వాళ్లవే. ఫ్లోరిడాలో ఒక్కరోజే 15,300 కేసులు నమోదయ్యాయి. అమెరికా చాలా చోట్ల ఇప్పటికీ మాస్క్ తప్పనిసరి చేయలేదు.

రాబోయే రోజుల్లో మరిన్నికష్టాలు

Latest Updates