పంచాయతీ కార్యదర్శి సోదరికి కరోనా.. ఊరంతా టెన్షన్

నల్గొండ జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి సోదరికి కరోనా సోకింది. దాంతో ఆ కార్యదర్శి పనిచేస్తున్న ఊరంతా ఆందోళనపడుతోంది. చింతపల్లి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి సోదరి డెలివరీ కోసం మూడు నెలలు కార్యదర్శి ఇంట్లోనే ఉంది. ఆమె ఇటీవలే హైద్రాబాద్‌లోని ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. దాంతో సోదరి దగ్గరకు పంచాయతీ కార్యదర్శి తరచుగా వెళ్లొచ్చేది. పంచాయతీ కార్యదర్శి ఈ నెల 27,28 తేదీలలో విధులకు హాజరైంది. అంతేకాకుండా.. ఈ నెల 27న చింతపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైంది. ఈ కాన్ఫరెన్స్‌లో ఆమెతో పాటు వివిధ గ్రామాలకు చెందిన మరో 30 మంది కార్యదర్శులు కూడా హాజరయ్యారు. వారందరితో కలిసి ఆమె అక్కడే భోజనం కూడా చేసింది. కార్యదర్శి సోదరికి పాజిటివ్ అని తెలియగానే తోటి కార్యదర్శులందరూ టెన్షన్ పడుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరైన అధికారులతో పాటు ప్రతి ఒక్కరిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. కాగా.. శనివారం పంచాయతీ కార్యదర్శి నమూనాలను వైద్యాధికారులు కరోనా పరీక్షల నిమిత్తం సేకరించారు. ఫలితాల కోసం ఆమెతో పాటు.. ఆ మండలంలోని కార్యదర్శులందరూ ఎదురుచూస్తున్నారు.

For More News..

తాజ్ మహల్ గోడ కూలి ముగ్గురు మృతి

కిలో మిడతలు పట్టి తెస్తే రూ.20

రాష్ట్రంలో ‘అన్​లాక్’పై నేడు సీఎం రివ్యూ

Latest Updates