వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా… హెలికాప్టర్ లో బెంగుళూరుకి తరలింపు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. సామాన్య జనం నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరిపైనా కరోనా దాడి చేస్తోంది. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రత్యేక హెలికాప్టర్‌లో కుటుంబసభ్యులు ఆయ‌న్ను బెంగళూరు తరలించారు. బెంగళూరులో దొరబాబు సమీప బంధువుల ఆస్పత్రి ఉండటంతో ఆయన్ను అక్కడికి తీసుకెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

శనివారం దొర‌బాబుకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌ రావడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. తనకు పాజిటివ్‌ వచ్చిందని, ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు. దొరబాబుకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్‌లో ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

Corona positive for Pithapuram YCP MLA Pendem Dorababu

Latest Updates