సింగర్ స్మిత కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌లో కరోనా వైరస్ పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రముఖ సింగర్ స్మిత కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. లక్షణాలు లేకపోయినప్పటికీ టెస్టులు చేయించుకున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. తనకు కరోనా సోకిన విషయాన్ని స్మిత్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. కరోనా ట్రీట్‌ మెంట్ తర్వాత ప్లాస్మా దానం చేస్తానని చెప్పారు. తనను ఇటీవల కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ఆమె రిక్వెస్ట్ చేశారు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి కొందరు ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా…మరికొందరు హోం క్వారంటైన్ లో ఉండి ట్రీట్ మెంట్ పొందుతున్నారు.

Latest Updates