తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. లేటెస్టుగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కాస్తంత అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం నుంచే హోమ్ క్వారంటైన్ అయ్యారు. వైద్యాధికారులు నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన కుటుంబంలో మరో నలుగురికి కూడా వైరస్‌ సోకింది.  వీరందరినీ హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. మిగతా కుటుంబీకుల శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపించారు.

సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ కు దగ్గర్లోని టక్కర బస్తీలో నివాసం ఉండే పద్మారావు.. ఇటీవలి కాలంలో పలు సమీప బస్తీల్లో తిరిగి కరోనా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన పర్యటనల్లో ఎవరి ద్వారానో ఆయనకు వైరస్ సోకుండవచ్చని తెలుస్తోంది. పద్మారావు ఇద్దరు మనవళ్లకు వైరస్ సోకిందని కుటుంబీకులు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితీ మెరుగుపడుతోందని అన్నారు డాక్టర్లు.

Latest Updates