కేరళలో మూడేళ్ల బాలుడికి కరోనా

కేరళలో మూడేళ్ల బాలుడికి కరోనా  పాజిటివ్ అని తేలింది. బాలుడు ఇటీవల కుటుంబ సభ్యులతో  ఇటలీ వెళ్లి శనివారం తిరిగి వచ్చారు. వీరికి కొచ్చి  ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు చేశారు. బాలుడిని ఎర్నాకులం మెడికల్ కాలేజీలో ఐసోలేషన్  వార్డులో ఉంచారు. బాలుడి  కుటుంబాన్ని కూడా ఆస్పత్రిలో అబ్జర్వేషన్ చేస్తున్నారు. బాలుడితో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 కి చేరింది. ఆదివారం కేరళలోని ఒకే ఫ్యామిలీలో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది.వీరిలో కూడా ముగ్గురు ఇటలీ వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.

Latest Updates