టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్

ఇప్పటికే తిరుమలలో ఆలయ అర్చకులు, జీయర్లు, టీటీడీ అధికారులు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు లేటెస్టుగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డిని సీఎం జగన్ టీటీడీ ఛైర్మన్ గా నియమించారు.

Latest Updates