నాకు కరోనా.. సిగ్గుపడాల్సిన అవసరం లేదు: టీవీ నటి నవ్య

వీడియో షేర్ చేసిన నవ్య స్వామి

హైదరాబాద్: బుల్లితెర నటి నవ్య స్వామికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అందరికీ తెలిసేటట్లు వీడియో షేర్ చేసింది. పలు టీవీ సీరియళ్లతోపాటు.. టీవీ ప్రకటనల్లోనూ నటించిన చిరపరిచితురాలు నవ్య. అనుమానంతో టెస్ట్ చేయించుకున్న తనకు పాజిటివ్ రాగానే ఏమాత్రం ఫీల్ కాలేదని… ఇందులో ఎవరూ సిగ్గు పడాల్సిన అవసరం లేదని.. భయపడాల్సిన అవసరం అంతకంటే లేదని చెప్పింది.

గత వారం రోజులుగా నన్ను కలసిన వారు… నాతో కలసి పనిచేసిన వారు ఎవరు ఎవరు ఉన్నారో, నన్ను ఎవరు ఎవరు కలిసారో వాళ్ళందరూ దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి.. ఒకవేళ నెగటివ్ వచ్చినా సెల్ఫ్ ఐసోలేషన్ వెళ్ళండి.. మీ వాళ్లందరికీ దూరంగా ఉండండి.. కరోనా వచ్చిందన్నా.. లేదా క్వారెంటైన్ లో ఉన్నామని చెప్పినా ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటుంటారు..  అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అని చెప్పింది. మీ ప్రేమానురాగాలు.. వెలకట్టలేని అభిమానం వల్ల నేను బాగానే ఉన్నా.. త్వరలోనే మరింత దృఢంగా మీ అందరి ముందుకు వస్తానని ధీమా వ్యక్తం చేసింది. కరోనా కల్లోలం నుండి అందరం సురక్షితంగా బయటపడాలంటే.. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కోవిడ్ నిబంధనలు అందరూ పాటించి.. కరోనాను అంతమొందించేందుకు తమ వంతు పాటుపడాలని వీడియోలో కోరింది.

Latest Updates