జగిత్యాల జిల్లాలో మరో ఇద్దరు వలస కార్మికులకు కరోనా

జగిత్యాల జిల్లా: ముంబై నుంచి వ‌ల‌స కార్మికుల‌తో జ‌గిత్యాల జిల్లా వాసులు వ‌ణికిపోతున్నారు. తాజాగా జిల్లాలో మ‌రో ఇద్దరికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఇద్దరు వలస కార్మికులకు కరోనా వైర‌స్ సోకిన‌ట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. అధికారులు వెంట‌నే వీరిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ సెంటర్‌కు పంపించారు. ఇప్పటివరకు జిల్లాలో 70 కేసులు నమోదవ‌గా… వీరిలో నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మృతి చెందారు. ప్ర‌స్తుతం జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 64.

Corona positive for two other migrant workers in Jagtial district

 

Latest Updates