యాదాద్రి జిల్లాలో మృతి చెందిన మహిళకు కరోనా పాజిటివ్

యాదాద్రి భువనగిరి జిల్లా: మరణించిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. రాజపేట మండలం, దూది వెంకటాపురం గ్రామానికి చెందిన 7నెలల గర్భిణీకి నొప్పులు రావడంతో రాజపేట PHCకి తరలించారు. 9 నెలలు నిండక పోవడంతో ఇంజక్షన్లు చేసినా డెలివరీ కష్టమైంది. రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు గర్భిణీని జనగామలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు హన్మకొండ హాస్పిటల్ కు రిఫర్ చేయగా.. పరిస్థితి విషమించడంతో హన్మకొండ డాక్టర్లు ఉస్మానియాకు రిఫర్ చేశారు.

ఉస్మానియాలో డెలివరీ కాగానే నెలలు నిండక పోవడంతో శిశువు(బాబు) చనిపోయాడని తెలిపారు డాక్టర్లు. ఆ తర్వాత మహిళకు తీవ్రంగా శ్వాస సమస్య ఏర్పడడంతో డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తుండగానే మృతి చెందింది. దీంతో సోమవారం ఉదయం శాంపిల్స్ సేకరించి టెస్ట్ లు చేయగా.. మంగళవారం ఉదయం కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు డాక్టర్లు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో చర్యలు చేపట్టారు.

Latest Updates