కరోనా పాజిటివ్ వస్తే పరేషాన్

 

దవాఖానలో చేర్చుకోక.. ఇంట్లో ఉండలేక అవస్థ

కరోనా సోకితే ఎక్కడుండాలో తెలియని పరిస్థితి

హైదరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు

అద్దె ఇంట్లో ఉండేవారిని వెళ్లిపొమ్మంటున్న ఓనర్లు

ఫ్యామిలీతో సొంతూళ్లకు ప్రయాణం

 వైద్యాధికారులు, సిబ్బంది పర్యవేక్షణ ఉండట్లే

హైదరాబాద్, వెలుగు: విరుచుకుపడుతున్న కరోనా వైరస్ కు తోడు.. ప్ర భుత్వం, అధికారుల నిరక్ష్లంతో ​పేషెంట్లను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సింప్టమ్స్ ఉన్నా, లేకున్నా శాంపిల్ ఇచ్చేంత వరకూ ధైర్యంగా ఉన్న వాళ్లు.. రిపోర్ట్ లో పాజిటివ్ వస్తే టెన్షన్ పడుతున్నారు. సిటీలోని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే అడ్మిట్ చేసుకోవడం లేదు. ఇంట్లో ఉందామంటే ఎక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కు వైరస్ వ్యాపిస్తుందోనని భయపడుతున్నారు. ఆర్ధిక స్థోమత ఉన్నవారు ప్రైవేట్ హాస్పిటల్స్‌‌, పెయిడ్ ​క్వారంటెయిన్‌‌ సెంటర్లలో ఉంటున్నారు. పేద, మధ్య తరగతి జనం ఎటుపోవాలో, ఎక్కడుండాలో తెలియక అవస్థ పడుతున్నారు. అద్దె ఇండ్లల్లో ఉండే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పాజిటివ్ వస్తే ఇంట్లోఉండేందుకు ఓనర్లు ఒప్పుకోవడం లేదు. ఇల్లుఖాళీ చేయాలని ఖరాకండిగా చెప్తున్నారు. దాంతో కొద్దిమంది సొంతూళ్లకు వెళ్తున్నారు. తప్పని పరిస్థితుల్లో పాజిటివ్‌ ‌పేషెంట్లు ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక కూడా గ్రామస్థుల నుంచి కొందరు అభ్యంతరాలు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు సిటీలో ప్రైవేట్ జాబ్‌ చేస్తున్నాడు. అతడికి పాజిటివ్ రావడంతో ఇంటి ఓనర్‌ ‌ఇక్కడ ఉండొద్ద ని చెప్పాడు. దాంతో సొంతూరుకు వెళ్లాడు. ఇలా పాజిటివ్ వచ్చిఇంట్లో ఉండే అవకాశం లేనివారికి ప్రభుత్వం క్వారంటె యిన్‌‌ సెంటర్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. నిర్లక్ష్యం చేస్తేవారు జనంలో తిరిగి వైరస్‌ ‌వ్యాప్తికి కారణమ్యే ప్రమాదం ఉంది. కొందరు శాంపిల్స్ ఇచ్చే టైమ్ లో రాంగ్ అడ్రస్ ఇస్తుండడంతో అలాంటి వారు ఎక్కడుంటారో వైద్య సిబ్బందికి కూడా తెలియడం లేదు . కొద్దిరోజుల తర్వాత ఆ వ్యక్తికి సంబంధిం చిన హెల్త్​డేటాను ఎవరూ పట్టించుకోవడం లేదు.

కేసుల ఇన్ఫర్మేషనే లేదు

కరోనా కట్టడికి ముందుండాల్సిన వైద్యారోగ్య శాఖ దగ్గర టెస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఉండడం లేదు. క్లస్టర్ల వారీగా ఎక్కడ ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి, ఎంతమంది హోం క్వారం టెయిన్‌‌లో ఉన్నారనేది పట్టించుకోవడం లేదు. పాజిటివ్ కేసుల ఇంటికి వెళ్లి మందులు కూడా ఇవ్వడం లేదు. ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా ఉంటుండగా, సిబ్బంది మొత్తానికే వదిలేశారు.

జాగ్రత్తలు కూడా చెప్పడం లేదు

పీహెచ్సీల్లో యాంటిజెన్ టెస్టులు చేసి పాజిటివ్ వస్తే ఇంటి అడ్రస్ తీసుకొని కొన్ని మందులు ఇచ్చి వెళ్లి పొమ్మంటున్నారు. ఇంటికి చేర్చేందుకు అంబులెన్స్ సౌకర్యం​ కూడా లేదు. ఓన్ వెహికల్లో వచ్చే వారి పరిస్థితి ఓకే. కానీ, కొందరు ఆటోలు, క్యాబ్​ల్లో వచ్చి అలాగే వెళ్తున్నారు. ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వైద్య సిబ్బంది చెప్పడం లేదని పలువురు వాపోతున్నారు.

 

Latest Updates