కొడుకు పుట్టాడని పార్టీ ఇచ్చిన ఎస్ఐ…కానిస్టేబుల్ కు కరోనా

ఇండియాలో కరోనా విజృంభిస్తోంది. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాకడౌన్‌ విధించాయి. సభలు, సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించకుండా చూడాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశాయి. ఆ ఆంక్షలు అమలు చేయాల్సిన ఓ పోలీసు అధికారే నిబంధనలు ఉల్లంఘించి ఓ కానిస్టేబుల్ కు కరోనా సోకడానికి పరోక్షంగా కారణమయ్యాడు. బెంగళూరులోని బళ్లారి జిల్లాలో కంప్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న వ్యక్తికి వారం రోజుల క్రితం కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాడనే సంతోషంలో ఓ గెస్ట్‌ హౌస్‌లో పోలీసు అధికారులకు, సిబ్బంది, తెలిసిన వారికి ఘనంగా పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి కంప్లి డివిజన్‌ సీఐతో సహా మరో 19 మంది పోలీసులు హాజరయ్యారు. ఆ పార్టీలో మందు కొట్టిన ఓ కానిస్టేబుల్‌ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ పార్టీకి హాజరైన వారు ఆందోళన చెందుతున్నారు. కంప్లి పోలీస్‌ స్టేషన్‌తో పాటు పార్టీ జరిగిన గెస్ట్‌ హౌస్‌ను కూడా అధికారులు మూసి వేశారు. కరోనా వ్యాప్తి సమయంలో పార్టీలు చేసుకోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates