
దేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కరోనా వైరస్ బారినపడుతున్నారు. లేటెస్టుగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు కరోనా భారిన పడ్డారు.దీనికి సంబంధించిన శుక్రవారం మధ్యాహ్నం ఆయనే స్వయంగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితమే ఆయన తొలి కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు. అయినా కరోనా పరీక్షల్లో వైరస్ సోకినట్లు తేలిందన్నారు. డాక్టర్ల సలహాతో ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్లో ఉంటున్నట్లు చెప్పారు ఒమర్ అబ్దుల్లా.
కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోల్సిందిగా ట్వీట్ చేశాడు ఒమర్ అబ్దుల్లా.