శబరిమలపై కరోనా తీవ్ర ప్రభావం

శబరిమల: మహమ్మారి కరోనా కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆలయం తెరిచిన ప్రతీసారి వేలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకునే వారు. అయితే ఇప్పుడు కేవలం 246 మంది మాత్రమే ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేయించుకున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

కరోనా నేపథ్యంలో సుమారు 7 నెలల తర్వాత శబరిమల ఆలయం నిన్న తెరుచుకుంది. ఇవాళ్టి నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అయితే నేటి దర్శనానికి కేవలం 246 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. దీంతో దర్శనాల సంఖ్యను 250కు కుదించారు.

కేరళలో రెండోసారి విజృంభిస్తుండడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్శనానికి 48 గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకొని, నెగటివ్ వచ్చిన వారినే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. స్వామి వారికి నెయ్యాభిషేకం, భక్తులకు అన్నదానాలు రద్దు చేశారు. పంపా నదిలో స్నానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. 10  ఏళ్ల లోపు చిన్నారులను, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించడం లేదు. స్వామి వారికి నెలవారీ పూజలు ఐదు రోజులు జరగనున్నాయి. ఆ తర్వాత ఆలయాన్ని మూసి వేయనున్నారు.

Latest Updates