నమస్తే ట్రంప్‌ వల్లే కరోనా: సంజయ్‌ రౌత్‌

  • లాక్‌డౌన్‌ విషయంలో బీజేపీపై కామెంట్లు

ముంబై: కరోనా వ్యాప్తి చెండటంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరీలో గుజరాత్‌లోని అమ్మదాబాద్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం వల్ల దేశంలో కరోనా వ్యాపించిందని అన్నారు. ఆ కార్యక్రమం వల్ల మొదట గుజరాత్‌లోకి వైరస్‌ వచ్చిందని, అక్కడి నుంచి మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చేరుకుందని చెప్పారు. ఎలాంటి ప్లాన్‌ లేకుండా లాక్‌డౌన్‌ను విధించిన కేంద్ర ప్రభుత్వం ఎత్తేసే బాధ్యతను మాత్రం రాష్ట్రలపైకి నెట్టేసి తప్పించుకుంటోంది అని రౌత్‌ విమర్శించారు. ‘మహా వికాస్‌ ఆఘాడీ’ కూటమిలో ఉన్న వాళ్లంతా ఏకతాటిపై ఉన్నారని, ప్రతిపక్ష బీజేపీ అనవసరంగా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రత్నిస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో అంతర్గత కలహాలు ఉన్నాయన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ బీజేపీ–శివసేన ప్రభుత్వాన్ని నడిపించలేదా అని ప్రశ్నించారు. కూటమిని ఏర్పాటు చేయడంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌‌ కీలక పాత్ర పోషించారని, ఇప్పటికి ఆయన సారథ్యంలో కూటమి బలంగా ఉందని రౌత్‌ చెప్పారు.

Latest Updates