అండమాన్ నికోబార్ దీవులకూ వ్యాపించిన కరోనా

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి లాస్ట్ కి అండ‌మాన్ నికోబార్ దీవుల‌కు కూడా చేరింది.
దీవుల్లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కోల్‌కత్తా నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. మార్చి 24న కోల్‌కత్తా నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ లో అండమాన్ దీవులకు చేరుకున్నట్టు గుర్తించారు. కరోనా చర్యల్లో భాగంగా ఈ నెల 22 నుంచే అండమాన్, నికోబార్ దీవులకు బయటి వ్యక్తులెవరూ రాకుండా నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా పాజిటివ్ గుర్తించిన వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ప్రత్యేక అనుమతి తీసుకున్నవారినే ఈనెల 24 వరకు అనుమతించామన్న స్థానిక ప్రభుత్వ యంత్రాగం..
ప్రత్యేక అనుమతితో తిరిగొచ్చిన వ్యక్తికే కరోనా వ‌చ్చిందని తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి దీవులకు తిరిగొచ్చిన ప్రతి ఒక్కరికీ 14 రోజుల క్వారంటైన్ అమలు చేశామ‌ని తెలిపారు అక్క‌డి అధికారులు.

Latest Updates