నాంపల్లి రైల్వేస్టేషన్లో అనుమానితుడు.. చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంప్

తెలంగాణలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్లో ఓ కరోనా అనుమానితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.   హైదరాబాద్ మంగళహాట్ కి చెందిన మోసిన్ అలీ.. నైజీరియా, లాగోస్ నుండి అబుదబి మీదుగా ఫ్లైట్ లో ముంబైకి వచ్చాడు.  ముంబై నుండి ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో నాంపల్లి రైల్వే స్టేషన్ కి ఉదయం చేరుకున్నాడు. మోసిన్ చేతి పై హోమ్ క్వారంటైన్ స్టాంప్ ఉండడంతో  తోటి ప్రయాణికుడు సాయిరాం పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  సమాచారం అందుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు వెంటనే మోసిన్ అలీని 108 అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Latest Updates