ఐసోలేషన్ కు ఢిల్లీ ప్రార్థ‌న‌లో పాల్గొన్న జ‌న‌గామ జిల్లా వ్య‌క్తి

జనగామ జిల్లా: నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన కరోనా అనుమానితుడు ఎండి ఖాజామియాను ఐసోలేషన్ కు తరలించారు. ఇత‌డు కూడా ఢిల్లీలో ప్రార్ధన మందిరంలో పాల్గొన్న‌ట్లు తెలియ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కరోన వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యాధికారులు, ఐసోలేషన్ వార్డుకు పరీక్షల నిమిత్తం తరలించారు. ఖాజామియా ఈ నెల 13వ తేదీ నుండి 15 వ తేదీ వరకు మార్కజ్ ప్రార్ధన మందిరం సభకు హాజరయ్యాడు.

ఈ నెల 18న కాజీపేటకు చేరుకొని స్వగ్రామమైన జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ కు చేరుకున్నాడు. కరోనా అనుమానిత వ్యక్తి ఖాజామియా మటన్ వ్యాపారి, ఇతను అక్కడి నుంచి వచ్చిన తరువాత రెండు సార్లు మటన్ కొట్టి అమ్మడు. దీంతో వెల్దండ గ్రామంలోని మటన్ తీసుకున్న వారందరికీ హోం క్వారయింటెన్లో ఉండాలని 35 మంది పైగా ఇండ్లకు నోటీసులు పంపిణీ చేశారు. దీంతో ఆ గ్రామ ప్ర‌జ‌లు భయంతో ఇండ్లల్లోంచి బయటకి వెళ్ల‌డంలేదని తెలిపారు అధికారులు.

Latest Updates