ఆరోగ్య సేతుతో ముగ్గురు కరోనా అనుమానితుల గుర్తింపు

శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపిన హెల్త్ స్టాఫ్​
లక్నో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఉత్తరప్రదేశ్ లో ముగ్గురు కరోనా అనుమానితులను అధికారులు గుర్తించారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని.. అందులో అడిగిన సెల్ఫ్​అసెస్ మెంట్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. దీని ప్రకారం వారు హై రిస్క్ లెవల్ లో ఉన్నారని, టెస్టింగ్ కోసం హెల్ప్ లైన్ కు కాంటాక్ట్ అవ్వాల్సిందిగా యాప్ నుంచి సూచనలు అందాయి. వారు హెల్త్ మినిస్ట్రీకి సమాచారం అందించారు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అందడంతో యూపీ గవర్నమెంట్ అలర్ట్ అయింది. వారి పేర్లు, అడ్రస్, ఫోన్ నంబర్స్ వంటి వివరాలను ప్రభుత్వం నుంచి తీసుకొన్న హెల్త్​ స్టాఫ్​వారి దగ్గరికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఆ తర్వాత వాటిని టెస్టింగ్ కు పంపించారు.

Latest Updates