ముస‌లవ్వ‌కు క‌రోనా సిమ్ట‌మ్స్.. ఊరి బ‌య‌ట‌ గుడిసెలో ఉంచిన కుటుంబసభ్యులు

రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం విట్యాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. విట్యాల గ్రామానికి చెందిన ఓ మహిళకు మూడు రోజుల నుండి దగ్గు, జ‌లుబు, జ్వ‌రం వ‌చ్చింది. దీంతో కరోనా లక్షణాలు ఉన్నాయని ఇంట్లో చిన్నపిల్లలు ఉండడంతో.. ఆమెను కుటుంబ స‌భ్యులు ఊరి బయట గుడిసెలో ఉంచారు. ఇదే విష‌యంపై మూడు రోజుల నుంచి వైద్య అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అస్సలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే తరుణంలో.. ఊరికి చివరగా వర్షానికి తట్టుకొని కాలం వెల్లదిస్తుంది ఆ మహిళ. ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం ఆమె ఊరి చివర గుడిసెలో జీవనం సాగిస్తున్న ఘటన పలువురిని బాధిస్తుంది. వైద్య అధికారులు వెంట‌నే వ‌చ్చి ఆమెకు ప‌రీక్ష‌లు చేయాల‌ని కోరుతున్నారు గ్రామ‌స్థులు.

Latest Updates