టెస్టుకు 1,200లే.. వెయిటింగ్​కే రూ.3 వేలు

  • కరోనా రేట్లపై శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లోని మై జీనోమ్​ ల్యాబ్​ వివరణ

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్టులోని తమ ల్యాబ్ లో  చేస్తున్న కరోనా టెస్టుకు రూ.4,200 తీసుకుంటున్న మాట వాస్తవమేనని మ్యాప్ మై జీనోమ్ ల్యాబ్ యాజమాన్యం అంగీకరించింది. అయితే, ఇందులో రూ.1,200 మాత్రమే టెస్టు కోసం తీసుకుంటున్నామని చెప్పింది. ఫారిన్ నుంచి వస్తున్న ప్యాసింజర్ల వద్ద ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.850కి బదులు రూ.4,200 వసూలు చేస్తున్నారని ‘వెలుగు’ పత్రికలో  ప్రచురితమైన వార్తకు మ్యాప్ మై జీనోమ్ ల్యాబ్ గురువారం వివరణ ఇచ్చింది. టెస్ట్ వేగంగా చేస్తున్నందుకు, రిజల్ట్ వచ్చే వరకూ వెయిటింగ్‌ లాంజ్‌లో ఉండడానికి అవకాశం ఇస్తున్నందుకు మరో రూ.3 వేలు చార్జ్‌ చేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇందులోనే ప్యాసింజర్‌‌కు ఫుడ్, డ్రింక్స్‌ కూడా అందిస్తున్నామన్నారు.

Latest Updates