అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా టెస్ట్

కరోనా వైరస్ ఒక దేశం నుంచి మరో దేశానికి పాకుతూ దాదాపు 149 దేశాలకు విస్తరించింది. కరోనా దెబ్బకు అన్ని దేశాలలో కలిపి 5,617 మంది చనిపోయారు. అమెరికాలో కూడా 2,226 కేసులు నమోదయ్యాయి. ట్రంప్ గతవారం బ్రెజిల్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఆ బృందంలో ఒకరికి వైరస్ సోకినట్లు తెలిసింది. దాంతో ట్రంప్ కూడా శుక్రవారం రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ట్రంప్‌కు వైరస్ నెగిటివ్ వచ్చినట్లు ఆయన పర్సనల్ డాక్టర్ సీన్ కాన్లీ శనివారం తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి బ్రిటన్ మరియు ఐర్లాండ్‌లకు ప్రయాణాలను నిషేధించారు. ఇది చాలా మంది అమెరికన్లపై ప్రభావాన్ని చూపుతుంది. అమెరికన్లు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయరాదని ట్రంప్ కోరారు. తాను కూడా తన ప్రయాణాల గురించి మరోసారి ఆలోచిస్తానని ఆయన అన్నారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ కేసులు 2,226 నమోదయ్యాయని.. ఈ వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు. వైరస్ ఎదుర్కొనేందకు తాము సిద్ధంగా ఉన్నామని.. ప్రజలెవరూ భయపడవద్దని ఆయన అన్నారు.

For More News..

బ్యాడ్‌న్యూస్: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా

ఫోన్ కొనాలంటే వెంటనే కొనేయండి.. ఏప్రిల్ నుంచి ఫోన్ల ధర పెంపు

వాగులో విలేజ్ సెక్రటరీ మృతదేహం

3 గంటల్లో 30 పేపర్లు దిద్దిస్తున్రు

Latest Updates