బొంతు రామ్మోహన్ కు మరోసారి కరోనా పరీక్షలు

హైద‌రాబాద్: జీహెచ్ఎంసీ ప‌రిధిలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం మేయ‌ర్ డ్రైవ‌ర్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు జీహెఎంసీ స‌బ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ క‌రోనా పరీక్షలు నిర్వ‌హించ‌గా.. తాజాగా మ‌రోసారి క‌రోనా పరీక్షలు నిర్వ‌హించారు డాక్ట‌ర్లు. మేయ‌ర్ డ్రైవ‌ర్ కు పాజిటివ్ రావ‌డంతో శుక్ర‌వారం బొంతు రామ్మోహ‌న్ శాంపిల్స్ తీసుకున్నారు డాక్ట‌ర్లు. అయితే నాలుగు రోజుల క్రితమే బొంతు రామ్మోహన్‌ కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగటివ్‌ అని తేలింది.

Latest Updates