ఒక్కరోజే 1133 మంది మృతి.. 5 కోట్లు దాటిన కరోనా టెస్టులు

భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండగా..గడిచిన 24 గంటల్లో కేసులు తగ్గాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 75,809 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మొదటి సారి ఒక్కరోజే 1133 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల  సంఖ్య మొత్తం 42,80,423 కు చేరగా..మరణాల సంఖ్య 72,775 కు చేరింది. 33,23,951 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 8,83,697 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరో వైపు దేశంలో నిన్నఒక్కరోజే  10,98,621 టెస్టులు చేశారు. వీటితో కలిపి సెప్టెంబర్ 7 వరకు కరోనా టెస్టుల సంఖ్య మొత్తం దేశంలో 5,06,50,128కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

Latest Updates