ఎంజీఎంలో 24 గంటలు కరోనా పరీక్షలు

వరంగల్ : ఎంజీఎంలో ఇక నుంచి 24 గంటల పాటు కోవిడ్ పరీక్షలు చేస్తామని తెలిపారు సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి కరోనా భారిన పడిన రోగులకు మొరుగైనా చికిత్స అందించటం వల్లనే కోవిడ్ వార్డులో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి కరోనా బారిన పడిన రోగులు వస్తున్నారని.. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, 440 బెడ్స్ అందుభాటులో ఉంచామన్నారు.

ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. ప్రస్తుతం 130 మంది కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఎంజీఎంలో వెంటి లేటర్ల కొరతలేదని .. ఎంత మంది రోగులు వచ్చినా చికిత్స అందిస్తామని తెలిపారు ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి.

Latest Updates