కరోనా టెస్టులు ఫ్రీ

ప్రజలందరికీ ఫస్ట్​ రెండు టెస్టులు ఉచితమన్న కేంద్రం

ఇటలీ, ఇరాన్​లో చిక్కుకున్నోళ్లు ఇండియాకు

దేశంలో 107కు చేరిన కరోనా కేసులు

కరోనా టెస్టులను ఫ్రీగా చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి రెండు కన్ఫర్మేషన్​ టెస్టులను పౌరులందరికీ ఉచితంగా చేస్తామని ప్రకటించింది. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ విషయాన్ని ప్రకటించారు. టెస్టులు చేయడానికి దేశంలో పూర్తిస్థాయి మౌలిక వసతులున్నాయని, కానీ, ఇప్పటిదాకా రోజూ 10 శాతానికి మించి అవసరం పడట్లేదని చెప్పారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 107కి చేరింది. 31 కేసులతో మహారాష్ట్ర టాప్​లో ఉంది. తర్వాత 22 కేసులతో కేరళ రెండో స్థానంలో నిలిచింది. ఎయిమ్స్​ 24/7 హెల్ప్​లైన్​ నంబర్​ 9971876591ను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 13 దాకా 703 షిప్పులు, అందులోని 25,504 మంది సిబ్బందిని తీరం నుంచే వెనక్కు పంపించేశామని కేంద్ర షిప్పింగ్​ శాఖ ప్రకటించింది. దేశ, విదేశాలకు గ్రూప్​ టూర్లను నిషేధిస్తూ ముంబై పోలీసులు  144 సెక్షన్​ను విధించారు. టూర్​ ఆపరేటర్లు ఎవరైనా దానిని అతిక్రమిస్తే క్రిమినల్​ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్తార్​పూర్​ కారిడార్​ టూర్​ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పాకిస్థాన్​ ఇంటర్నేషనల్​ బోర్డర్​ నుంచి అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించింది. కరోనా బాధితుడి వివరాలను బయటపెట్టినందుకు జమ్మూ కాశ్మీర్​ డాక్టర్​ను సస్పెండ్​ చేశారు. ఢిల్లీలో తొలి కరోనా పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి అతడిని డిశ్చార్జ్​ చేశారు.

ఇటలీ, ఇరాన్​ నుంచి తీసుకొచ్చిన్రు

ఇటలీ ఎయిర్​పోర్టులో చిక్కుకుని గోస తీస్తున్న ఇండియన్లు ఎట్టకేలకు దేశానికి తిరిగొచ్చేశారు. 211 మంది స్టూడెంట్లు సహా 218 మందిని మిలాన్​ నుంచి రక్షించి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​లో ఎయిరిండియా ప్రత్యేక విమానం ల్యాండ్​ అయినట్టు విదేశాంగ శౄఖ సహాయ మంత్రి వి. మురళీధరన్​ తెలిపారు. అందరినీ ఢిల్లీలోని చావ్లా ఐటీబీపీ క్వారెంటైన్​కు తరలించారు. ఇటు ఇరాన్​లో చిక్కుకున్న వారినీ ఇండియాకు తీసుకొచ్చారు. మూడో బ్యాచ్​లో 234 మందిని రెండు ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో రాజస్థాన్​లోని జైసల్మీర్​కు తీసుకొచ్చామని, అందులో 131 మంది స్టూడెంట్లు కాగా, 103 మంది భక్తులున్నారని విదేశాంగ మంత్రి ఎస్​. జైశంకర్​ తెలిపారు. అందరినీ అక్కడి ఇండియన్​ ఆర్మీ వెల్​నెస్​ సెంటర్​లో క్వారెంటైన్​కు పంపారు. బ్రిటన్​కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ రావడంతో విమానంలోని 289 మందినీ దించేశారు.  మొన్నటిదాకా మున్నార్​లోని ఓ హోటల్​ క్వారెంటైన్​లో ఉన్న అతడు, అతడి భార్య, అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. ఎలాగోలా వాళ్ల ఆచూకీని పట్టేసి కొచ్చి ఎయిర్​పోర్టులో పట్టుకున్నారు. దుబాయ్​ వెళ్లేందుకు ఎమిరేట్స్​ ఫ్లైట్​ ఎక్కిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ప్రయాణికులనూ కరోనా ముప్పుతో అందరినీ క్వారెంటైన్​కు పంపారు.

స్పెయిన్​ పీఎం భార్యకూ

స్పెయిన్​ ప్రధాని పెడ్రో షాంచెజ్​ భార్య బెగోనా గోమెజ్​కూ కరోనా పాజిటివ్​ వచ్చింది. శనివారం అర్ధరాత్రి ఆ దేశ పీఎంవో ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఇద్దరూ హోం క్వారెంటైన్​లోనే ఉన్నారని, అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారని చెప్పింది. కాగా, కరోనా కేసులు, మృతులు పెరిగిపోతుండడంతో దేశం మొత్తాన్ని లాక్​డౌన్​ చేస్తూ సర్కార్​ ఉత్తర్వులిచ్చింది.

ఇటలీ వర్కర్లపై పని భారం

వైరస్​తో సతమతమవుతున్న ఇటలీలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. దానికి సంబంధించిన ఓ నర్సు ఫొటో ఇటీవల సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో చర్చకు దారి తీసింది. ఎలీనా పాగ్లియారిని అనే నర్సు పనిచేస్తూచేస్తూనే కంప్యూటర్​ ముందు అలా నిద్రపోయారు. ‘‘నా ఫొటో అలా వైరల్​ అవ్వడం చూసి నాపై నాకే అసహ్యం వేసింది. నా బలహీనతను నాకు నేనే ఎత్తి చూపినందుకు బాధగా ఉంది. అయితే, నా లాంటి వాళ్లు పడుతున్న బాధలపై జనాల నుంచి వచ్చిన స్పందనలను చూసి సంతోషమేసింది. నిజానికి నేను 24 గంటలూ పనిచేసేందుకు వెనుకాడను. అలసిపోయినా ఇలాంటి కష్టకాలంలో అండగా ఉండేందుకు నేనెప్పుడూ ముందుంటా. మనకు తెలియని శత్రువుపై పోరాడతా’’ అని చెప్పారు. ఇది ఆమె ఒక్కరి స్టోరీనే కాదు. కరోనాపై పోరాటంలో భాగంగా రేయింబవళ్లు పనిచేస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర సిబ్బందిదీ అదే పరిస్థితి.

మాస్కులు కుట్టిన ఎంపీ ఖైదీలు

ఇప్పుడు మాస్కులకు గిరాకీ బాగా పెరిగింది. కొన్ని చోట్ల వాటి కొరత కూడా ఉంది. దీంతో మధ్యప్రదేశ్​లోని ఖైదీలు మాస్కులు తయారు చేసే పనిలో పడ్డారు. జబల్​పూర్​లోని నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ సెంట్రల్​జైలులో శిక్ష అనుభవిస్తున్న 50 మంది  ఖైదీలు 2 వేల మాస్కులను సిద్ధం చేశారు. వాటన్నింటినీ రాష్ట్ర సర్కారుకు అందించనున్నారు.

ట్రైన్లు, బస్సులు, క్యాబ్​ల క్లీనింగ్​

వైరస్​ సోకకుండా రైళ్లు, బస్సులు, ప్రైవేట్​ క్యాబ్​లను డిసిన్​ఫెక్టెంట్లతో క్లీన్​ చేస్తున్నాయి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా రైళ్లన్నింటినీ క్లీన్​ చేయిస్తామని ఇప్పటికే రైల్వే ప్రకటించింది. బోగీ ఫిట్టింగులు, డోర్లు, సీట్లు, డోర్​ హ్యాండిళ్లు, కిటికీ ఊచలు, కరెంట్​ స్విచ్​లు సహా మొత్తం రైళ్లను శుభ్రం చేయిస్తామని చెప్పింది. సెంట్రల్​ రైల్వే, దక్షిణ రైల్వే ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో మెట్రో రైళ్లతో పాటు బస్సులనూ క్లీన్​ చేయిస్తున్నారు సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. ఇప్పుడు దానిని మినీ బస్సులు, ప్రైవేట్​ క్యాబ్​లకూ పొడిగించారు. కర్నాటకలో ఏడో క్లాసు నుంచి 9వ క్లాస్​ వరకు పరీక్షలన్నింటినీ రద్దు చేశారు. తమిళనాడులోనూ స్కూళ్లు బంద్​పెట్టారు. ఉత్తరాఖండ్​, పశ్చిమబెంగాల్​, పుదుచ్చేరిలోనూ స్కూళ్లు మూత పెట్టారు. కాగా, కోల్​కతాలోని బెలియాఘాటా ఐడీ అండ్​ బీజీ ఆస్పత్రిలో పది మంది కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. మిజోరాంలో 117 మంది క్వారెంటైన్​ చేశారు. దుబాయ్​లో ఇండియన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దుబాయ్​ సర్కారు 2,700 కోట్ల డాలర్లు రిలీజ్​ చేసింది.

భక్తులు లేకుండా వాటికన్​ ఈస్టర్​

కరోనా వైరస్​ నేపథ్యంలో భక్తులెవరూ లేకుండా ఈస్టర్​ ఉత్సవాలను జరపాలని వాటికన్​ నిర్ణయించింది. ఏప్రిల్​ 12 వరకు లైవ్​లో మాత్రమే ఉత్సవాలను చూడాల్సిందిగా కోరింది. ముస్లింలకు మూడో పవిత్ర క్షేత్రమైన అల్​అఖ్సా మసీదును ఇరాన్​ క్లోజ్​ చేసింది. నిరవధికంగా మసీదును మూసేస్తున్నామని మసీద్​ డైరెక్టర్​ షేక్​ ఒమర్​ కిశ్వానీ చెప్పారు.

ట్రంప్​కు వైరస్​ లేదు

అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​కు కరోనా టెస్ట్​ నెగెటివ్​ వచ్చింది. కొన్ని రోజుల కిందట బ్రెజిల్​ ప్రెసిడెంట్​ జెయిర్​ బోసనారో, ఆయన ప్రెస్​ సెక్రటరీతో ట్రంప్​ సమావేశమైన సంగతి తెలిసిందే. వాళ్లిద్దరికీ కరోనా పాజిటివ్​ రావడంతో శనివారం ట్రంప్​ కూడా టెస్టుల కోసం శాంపిళ్లు ఇచ్చారు. వైట్​హౌస్​ డాక్టర్​ శాన్​ కోన్లీ శాంపిళ్లను తీసి టెస్టులకు పంపించారు. టెస్టుల రిపోర్టులను వైట్​ హౌస్​ ప్రెస్​ సెక్రటరీ స్టెఫానీ గ్రీషమ్​కు అందించారు. బ్రెజిల్​ ప్రెసిడెంట్​తో ట్రంప్​ భేటీ అయి వారం అవుతున్నా ట్రంప్​కు మాత్రం ఎలాంటి వైరస్​ సోకలేదని, వైరస్​ లక్షణాలూ లేవని చెప్పారు. యూరోపియన్​ యూనియన్​పై విధించిన ట్రావెల్​ బ్యాన్​ను బ్రిటన్​, ఐర్లాండ్​కూ పెంచింది అమెరికా సర్కార్​. దీంతో ఎయిర్​పోర్టుల వద్ద ప్రయాణికులు బారులు తీరుతున్నారు. ఇప్పటికే చాలా ఎయిర్​లైన్స్​ సంస్థలు సర్వీసులను నిలిపేశాయి. దీంతో టికెట్లు దొరక్క విమానాశ్రయాల్లో భారీ క్యూలైన్లు పెరిగిపోతున్నాయి.

156 దేశాలకు

కరోనా వైరస్​ 156 దేశాలకు పాకింది. 1,62,501 మందికి సోకింది. 6,068 మందిని బలి తీసుకుంది. ఎక్కువ మరణాలు చైనాలోనే నమోదైనా, ఇటలీలో కేసులు, మరణాలు పెరుగుతుండడం కలవర పెడుతోంది. చైనాలో 80,849 మందికి వైరస్​ సోకగా 3,199 మంది చనిపోయారు. ఇటలీలో కేసుల సంఖ్య 21,157కి పెరిగింది. 1,441 మంది చనిపోయారు. ఇరాన్​లో 13,938 కేసులు రికార్డయ్యాయి. 724 మంది చనిపోయారు. స్పెయిన్​లో 291, ఫ్రాన్స్​లో 91, సౌత్​కొరియాలో 75, అమెరికాలో 60 మంది చనిపోయారు. బ్రిటన్​లో 21, జపాన్​లో 24, నెదర్లాండ్స్​లో 20 మంది కరోనాకు బలయ్యారు.

బ్రిటన్​ రాణిని తరలించారు

బ్రిటన్​ రాణి ఎలిజబెత్​II, ఆమె భర్త ఫ్రిన్స్​ ఫిలిప్​ను అధికారులు లండన్​లోని బకింగ్​హాం ప్యాలెస్​ నుంచి విండ్సర్​ కెజిల్​కు ఆమెను తీసుకెళ్లారు. ఇద్దరినీ నోర్ఫోక్​లోని శాండ్రింగాం ఎస్టేట్​లో క్వారెంటైన్​లో పెడతారని చెబుతున్నారు.

శవాలతో వైరస్​ రాదు

ఢిల్లీలో కరోనాతో చనిపోయిన ఓ మహిళ అంతిమ సంస్కారాలు చేసేందుకు శ్మశానవాటిక వాళ్లు ఒప్పుకోని విషయం తెలిసిందే. మరి, శవాల నుంచి వైరస్​ సోకుతుందా.. అంటే సోకదు అని డబ్ల్యూహెచ్​వోతో పాటు ఎయిమ్స్​ డాక్టర్లు చెబుతున్నారు. వైరస్​ డిజాస్టర్​ తర్వాత చనిపోయిన వాళ్ల నుంచి ఇంకొకరికి వైరస్​ సోకదని డబ్ల్యూహెచ్​వో పేర్కొంది. చనిపోయాక ఒంట్లోని ఏ కణమూ పనిచేయదని, వాటిపై బతికే ఏ ఏజెంట్​ కూడా సర్వైవ్​ కాలేదని తెలిపింది. శవాలతో ఎప్పుడూ డీల్​ చేసే వారికి కలరా, హీమోరేజిక్​ ఫీవర్​, టీబీ, హెపటైటిస్​ బీ, సీ, హెచ్​ఐవీ, గ్యాస్ట్రిక్​ సమస్యలు వస్తాయని తెలిపింది. దాంతో పాటు కరోనా మృతుల అంతిమసంస్కారాలపై కొన్ని సూచనలూ చేసింది.

శ్మశాన వాటికలు భూగర్భ జల వనరులకు కనీసం 30 మీటర్ల దూరంలో ఉండాలి.

వాటర్​ టేబుకు 1.5 మీటర్ల ఎత్తులోనే చితులు ఏర్పాటు చేయాలి.

శ్మశానవాటికల్లోని నీళ్లు జనావాసాల మధ్యలోకి రాకుండా చూడాలి.

రక్తం, బాడీ ఫ్లుయిడ్స్​ను డీల్​ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

గ్లోవ్స్​ను ఒక్కసారి మాత్రమే వాడాలి. వెంటనే కరెక్ట్​గా డిస్పోజ్​ చేయాలి.

శవాలకు బాడీ బ్యాగులను తొడగాలి.

శవాలను ముట్టుకున్న తర్వాత చేతులను బాగా కడుక్కోవాలి.

వాహనాలను డిసిన్​ఫెక్టెంట్లతో క్లీన్​ చేయాలి.

హెపటైటిస్​ బీ వ్యాక్సిన్​ వేయించుకోవాలి.

కలరా వంటి పరిస్థితుల్లో మినహా శవాన్ని డిసిన్​ఫెక్టెంట్​ చేయాల్సిన అవసరం లేదు.

For More News..

కట్నం కోసం కరోనా వేధింపులు

Latest Updates