దేశంలో ఒక్కరోజే 97 వేల కేసులు..6 కోట్లు దాటిన టెస్టులు

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు ప్రతి రోజు  90 వేలకు పైగా నమోదవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 97,894  కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 51,18,254 కు చేరింది. నిన్న ఒక్కరోజే 1132 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 83,198 కి చేరింది. 40,25,080 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 10,09,976 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశలో కరోనా మరణాల రేటు 1.63 గా ఉంది.

నిన్న ఒక్కరోజే 11,36,613 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో దేశంలో కరోనా టెస్టుల సంఖ్య సెప్టెంబర్ 16 నాటికి 6,05,65,728 కి చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

 

Latest Updates