బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌కు కరోనా పరీక్షలు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారినపడ్డారు. లేటెస్టుగా బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌ కు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్‌.. పలువురు నేతలతో సమావేశమైయ్యారు. అయితే వారిలో ఓ నేతకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సీఎంకి కూడా వైరస్‌ సోకి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. నితీష్‌ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. రెండు రోజుల్లో రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు సీఎం అధికారిక కార్యక్రమలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే నిర్వహించన్నారు.

Latest Updates