మహారాష్ట్ర పోలీసులను వణికిస్తున్న కరోనా

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా నమోదు కేసులు భారీగా పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ కరోనాతో పోరాడుతున్న పోలీస్‌ శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇవాళ్టి(ఆదివారం,ఆగస్టు-2) వరకు 9,566 మంది పోలీసులకు కరోనా సోకినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

కరోనా వైరస్ కార‌ణంగా పోలీసు విభాగానికి చెందిన 103 మంది సిబ్బంది చనిపోయారు. వీరిలో 9 మంది ఉన్నతాధికారులు, 94 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం పోలీస్‌ శాఖలో 1,929 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 7,534 మంది పోలీసులు కోలుకున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 4 లక్షల 31వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 15,316 మంది కరోనా బారినపడి చనిపోయారు.

Latest Updates