మచిలీపట్నంలో కరోనా! రహస్యంగా ట్రీట్ మెంట్

మచిలీపట్నంలో కరోనా కలకలం రేపుతోంది.  డిల్లీ నుండి వచ్చిన ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బాధితుడు ఒక డాక్టర్ అన్న కొడుకు కావడంతో ఇంట్లోనే ఉంచి వైద్యం అందిస్తున్నారని ప్రచారం వస్తుంది. అయితే ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని సమాచారం రావడంతో మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ కు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం అందరికీ తెలియడంతో ఆసుపత్రికి రాకుండా బాధితుడికి ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.  అధికారులు ఆ బాధితుడిని గుర్తించే పనిలో పడ్డారు.

Latest Updates