కరోనా వ్యాక్సిన్స్ డబ్బున్నోళ్లకే ఫస్ట్

కోట్ల వ్యాక్సిన్ డోసులు బుక్ చేసిన రిచ్ కంట్రీస్
పేద దేశాలకు ఇప్పట్లో వ్యాక్సిన్ దొరికే చాన్స్ లేనట్లే

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ రాగానే కోట్ల కొద్దీ డోసులను తెచ్చుకోవడానికి రిచ్ కంట్రీస్ ఇది వరకే ఫార్మా కంపెనీలకు డబ్బులు గుమ్మరించాయి. ధనిక దేశాల ప్రజలు ఎలాగైనా ట్రీట్మెంట్ చేయించుకుంటారని, వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుంటే పేదదేశాల జనం పరిస్థితి ఏమిటంటూ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. గ్లోబల్ ఫార్మా కంపెనీలు సనోఫీ, జీఎస్‌‌కేల వ్యాక్సిన్ తయారీ పూర్తి కాగానే, బిలియన్ల డోసులు కొనేందుకు అమెరికా, బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరో ఫార్మా కంపెనీ ఫైజర్‌‌తో జపాన్ ఇలాంటి డీల్ కుదుర్చుకుంది. ఏదైనా వ్యాక్సిన్ పనిచేస్తుందనే తెలిసిన వెంటనే కోట్ల కొద్దీ డోసులు కొనడానికి యూరోపియన్ యూనియన్ రెడీగా ఉంది. దాదాపు అన్ని కంపెనీలూ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లు వ్యాక్సిన్‌ను అందుబాటు ధరలోనే తీసుకొస్తామని, రేటు ఎక్కువ ఉండకపోవచ్చని ప్రకటించాయి. ఇవి తయారు చేసే వ్యాక్సిన్‌లు ప్రపంచంలోని 780 కోట్ల మందికి సరిపోయే అవకాశమేలేదు. ఈ విషయంలో ధనిక దేశాలు కచ్చితంగా సప్లైను కంట్రోల్ చేస్తాయని పేద దేశాలు భయపడుతున్నాయి. స్వైన్ ఫ్లూకు వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఇలాగే జరిగిందని అవి గుర్తు చేస్తున్నాయి.

వ్యాక్సిన్‌‌పై పెరిగిన ఆశలు
అమెరికా, బ్రిటన్, ఈయూ, జపాన్‌లు ఇప్పటివరకు 130 కోట్ల కరోనా ఇమ్యూనైజేషన్ డోసులను కొన్నాయని లండన్‌‌కు చెందిన ఎయిర్‌‌ఫినిటీ వెల్లడించింది. మరో 150 కోట్ల డోసుల కోసం చర్చలు జరుగుతున్నాయని తెలియజేసింది. కంపెనీలు ఎంత త్వరగా వ్యాక్సిన్లను తయారు చేసినా, కొరత తప్పకుండా ఉంటుందని ఎయిర్‌‌ఫినిటీ సీఈఓ రాస్మన్ అన్నారు. మెజారిటీ వ్యాక్సిన్‌లు ఒక్క డోసు చాలవని, రెండు డోసులు కావాలని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా పీఎల్సీ, ఫైజర్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్ ఆఖరు దశకు వచ్చాయి. దీంతో వ్యాక్సిన్ కచ్చితంగా అందుబాటులోకి వస్తుందనే ఆశలు పెరిగాయి. అయితే అప్పుడే అంతా అయిపోలేదు. ఈ వ్యాక్సిన్లు ఎఫెక్ట్ చూపుతున్నట్టు రూఢి కావాలి. ప్రభుత్వాల నుంచి పర్మిషన్స్ రావాలి. మాన్యుఫ్యాక్చరింగ్ పెరగాలి. 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ డోసుల సప్లై 100 కోట్లకు మించకపోవచ్చని ఎయిర్‌‌ఫినిటీ అంచనా వేసింది.

For More News..

మళ్లీ కార్లు కొంటున్నరు

అయోధ్యకు ఆధ్యాత్మిక శోభ

తమిళనాడులో మత్స్యకారుడి హత్య.. 20 పడవలకు నిప్పు

Latest Updates