ఇయ్యాల్టి నుంచి.. రష్యన్లకు కరోనా వ్యాక్సిన్

దేశంలోని అన్ని రీజియన్లకూ ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ పంపిణీ

మాస్కో: రష్యాలో సోమవారం నుంచే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశంలోని అన్ని రీజియన్లకూ ఫస్ట్ బ్యాచ్ ‘స్పుత్నిక్–వి’ వ్యాక్సిన్ డోసులు డెలివరీ అయ్యాయని ఆదివారం రష్యన్ హెల్త్ మినిస్టర్ మిఖాయిల్ మురష్కో వెల్లడించారు. వీటిని ప్రజలకు ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. లెనిన్ గ్రాడ్ రీజియన్ తో సహా అన్ని రీజియన్లకూ వ్యాక్సిన్  డోసులను డెలివరీ చేశామని ఆయన చెప్పారు. గమలేయా ఫెడరల్ రీసెర్చ్ సెంటర్ తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను రష్యా ఆగస్టు 11న రిజిస్టర్ చేసింది. ప్రపంచంలోనే మొదటగా రిజిస్టర్ అయిన ఈ వ్యాక్సిన్  క్లినికల్ ట్రయల్స్ లో ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు తేలిందని మిఖాయిల్ తెలిపారు.

వ్యాక్సిన్ వాడకంలో ప్రతి స్టేజీనీ తాము వెరిఫై చేస్తామన్నారు. రష్యాలో కరోనాకు మరో వ్యాక్సిన్ క్యాండిడేట్ పై కూడా క్లినికల్ స్టడీస్ కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్ డీఐఎఫ్) విదేశాలకు ఎక్స్ పోర్ట్ చేయనుంది. 2020–21లో మొత్తం 100 కోట్ల మందికి వ్యాక్సిన్ ను అందజేస్తామని ఆర్ డీఐఎఫ్  సీఈవో కిరిల్ దిమిత్రివ్ శుక్రవారం వెల్లడించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ మళ్లీ ప్రారంభం కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ను ఆపడమే.. ఆ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్న పద్ధతి తప్పు అనేందుకు నిదర్శనమని కామెంట్ చేశారు.

 

Latest Updates