కెనడా ప్రధాని భార్యకు కరోనా వైరస్

కరోనా వైరస్ చైనాలో మొదలై.. ఒక్కొక్క దేశాన్ని తాకుతూ దాదాపు 116 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ ధాటికి చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా అందరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. తాజాగా.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో కూడా ఈ వైరస్ బారిన పడింది. తన భార్య సోఫీకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు సోఫీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఇటీవలే సోఫీ ఇటలీ వెళ్లోచ్చిందని ఆయన తెలిపారు. సోఫీ వైరస్ సోకడంతో తాను కూడా పరీక్షలు చేయించుకున్నానని.. అయితే ఆ పరీక్షల్లో తనకు ఎటువంటి వైరస్ లక్షణాలు తేలలేదని ఆయన తెలిపారు. అయినాసరే తాను కూడా 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండి.. తన పనులన్నింటిని ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు.

For More News..

సింధియాకు షాక్.. 6 ఏళ్ల క్రితం కేసు రీఓపేన్

పీసీసీ చీఫ్ నువ్వా.. నేనా..

ఇండియాలో కరోనా తొలి మరణం

అప్పుడు కేసీఆర్‌‌ను బండ బూతులు తిట్టిన

Latest Updates