యూకేలో పిల్లికీ కరోనా..!

లండన్: కరోనా జంతువులనూ వదలడం లేదు. తాజాగా బ్రిటన్ లో ఓ పెంపుడు పిల్లికి వైరస్ సోకింది. పెట్ క్యాట్ కు కరోనా సోకిందని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ క్రిస్టిన్ మిడిల్మిస్ కన్ఫమ్ చేశారు. ఇది చాలా అరుదైన సంఘటన అని పేర్కొన్నారు.పెట్స్ వైరస్ ను వ్యాప్తి చేస్తాయని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదని, జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకుతుందని చెప్పలేమన్నారు. పెట్ ఓనర్స్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని, వారి నుంచే పిల్లికి వైరస్ సోకి ఉంటుందని అధికారులు చెప్పారు. ‘‘బ్రిటన్ లో జంతువులకు కరోనా కన్ఫమ్ అయిన మొదటి కేసు ఇదే. పెట్ క్యాట్ కు ఎలాంటి ప్రమాదం లేదు” అని ఎన్విరాన్ మెంట్ మినిస్ట్రీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Latest Updates