భారత్ పై కరోనా ఉగ్రరూపం : ఆగస్ట్ 4 నాటికి ఇండియాలో 34వేలు దాటనున్న మరణాలు

ఆగస్ట్ నెల ప్రారంభానికి ఇండియాలో కరోనా ఉగ్రరూపం దాల్చనుందని అమెరికా సైంటిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  అమెరికాకు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ఫహీమ్ యూనస్ కరోనా వైరస్ గురించి  ప్రజల్లో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేస్తున్నారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఏదేశంలో కరోనా ఎలా ఉంటుందో చెబుతున్నారు. తాజాగా సైంటిస్ట్ ఫహీమ్ ఇండియా, పాకిస్తాన్ లలో కరోనా వైరస్ పంజా విసరనున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మార్చి నెల నుంచి మనదేశంలో కరోనా కేసులపై ఫహీమ్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా ఆగస్ట్ 4 నాటికి భారత్ లో 34,155 కరోనా మరణాలు,  ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి దాయాది దేశం పాకిస్తాన్ కరోనా మరణాలపై  నిర్వహించిన సర్వేలో ఆగస్ట్ 4నాటికి  5,332మంది మరణిస్తారని అన్నారు.

ఈ సందర్భంగా ఫహీమ్ తన  స్టేట్మెంట్ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరణాలపై కొంతమంది నాయకులు, ప్రజలు ద్వేషించవచ్చు. కానీ కరోనా మాత్రం రెండు దేశాల్ని సమానంగా ప్రేమిస్తుంది. ప్రొజెక్షన్ తప్పు కావచ్చు. కానీ పాఠం నిజమవుతుందంటూ ట్వీట్ చేశారు.

Latest Updates