ఢిల్లీలో మళ్లీ విజృంభించిన కరోనా వైరస్

ఢిల్లీలో కరోనా వైరస్‌ రెండోసారి విజృంభించిందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. రోజువారీ పాజిటివ్‌ కేసుల నమోదు 4 వేలు దాటుతోందన్నారు. దీంతో ఢిల్లీలో రెండోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్నట్లు నిఫుణులు చెబుతున్నారన్నారు కేజ్రీవాల్. ఈ నెల 16న రికార్డు స్థాయిలో 4,500 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. ఆ తర్వాత రోజువారీ వైరస్‌ కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపించిందని.. అయితే గత 24 గంటల్లో మరోసారి 3,700కు పెరిగినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు.

ఈ నెల 15 నుంచి 19 వరకు వరుసగా ఐదు రోజులపాటు రోజువారీ కరోనా కేసుల నమోదు సంఖ్య నాలుగు వేలకు పైగా ఉన్నదని చెప్పారు సీఎం కేజ్రీవాల్. ఈ క్రమంలో ఢిల్లీలో రెండోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్నట్లు నిఫుణులు అభిప్రాయపడుతున్నారని చెప్పారు.

Latest Updates