విశాఖలో కరోనా కలకలం.. ఐదుగురికి వైరస్ లక్షణాలు

కరోనా వైరస్ విశాఖకు కూడా వ్యాపించినట్టు వార్తలొస్తున్నాయి. నగరంలోని చెస్ట్ ఆసుపత్రిలో బుధవారం అయిదు అనుమానిత కేసులు నమోదైనట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

అయిదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కాగా… మరో ఇద్దరు ఓ యువతి, ఆమె స్నేహితుడు. రామ్ నగర్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబం ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్ కు వెళ్లి వచ్చింది. అయితే ఆ కుటుంబంలోని  తండ్రి, తల్లి, కుమార్తె లకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు, ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది.

గాజువాక ప్రాంతానికి చెందిన ఓ యువతికి, ఆమె స్నేహితుడికి కూడా కరోనా లక్షణాలున్నట్టు సమాచారం. ఇటీవల బహ్రెయిన్ లో ఉంటున్న ఆ యువతి తల్లిదండ్రులు వద్దకు వెళ్లి వచ్చిందని,  ఆమె స్నేహితుడైన మరో వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఐదుగురి శాంపిల్స్ సేకరించి గాంధీ ఆసుపత్రికి, పూణే కి పంపగా.. రిపోర్టులు రేపు (గురువారం) వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Corona virus  suspects in Visakhapatnam.. Five are symptomatic

 

Latest Updates