ఇండియాలో కరోనా తొలి మరణం

దేశంలో తొలి కొవిడ్ మరణం నమోదైంది. కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి వైరస్‌కు బలయ్యాడు. కరోనాతో చనిపోయాడన్న అనుమానంతో అతడి శాంపిళ్లను టెస్టులకు పంపించారు. టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ వ్యక్తి చనిపోయింది కరోనాతోనేనని కర్నాటక ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ వ్యక్తి ఇటీవలే సౌదీ నుంచి గుల్బర్గాకు వచ్చాడు. అనారోగ్యంతో
స్థానిక డాక్టర్ల వద్ద చూయించుకోగా.. వాళ్లు హైదరాబాద్‌కు పంపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు వస్తుండగా
చనిపోయాడని కర్నాటక హెల్త్​ కమిషనర్ తెలిపారు.

Latest Updates