హోళిక బదులు కరోనా దహనం

హోళీ పండుగ సందర్భంగా హోళిక దహనం చేయడం సంప్రదాయం. కానీ, ముంబైలో సోమవారం వెరైటీగా కరోనా దహనం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ బెడద వదిలిపోవాలని దేవుడిని ప్రార్థిస్తూ ‘కరోనాసుర’  వైరస్ అని పేరు పెట్టి.. ఈ వేడుకను నిర్వహించారు. ముంబైలోని వోర్లీ ఏరియాలో ఈ వెరైటీ హోళికా దహనం జరిగింది. దేశంలో కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలన జరగాలని కోరుకుని ఇలా హోళిక దహన వేడుకను చేసినట్లు చెప్పారు స్థానికులు.

అలాగే ముంబైలోని మరికొన్ని ఏరియాల్లో హోళిక దహనాన్ని వేర్వేరు థీమ్స్‌తో నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మలను చేసి తగలబెట్టారు. కొన్ని ఏరియాలో నిర్భయ దోషుల సంహారం థీమ్‌తో బొమ్మలను చేశారు. ఓ మహిళా యోధురాలు నిర్భయ దోషుల తలలను చేతబట్టుకుని ఉన్నట్లుగా బొమ్మలు రూపొందించారు.

Latest Updates