మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం.. 24 గంటల్లో..

ముంబై: మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 597 కొత్త కేసులు నమోదు కాగా 32 మంది మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. చనిపోయిన వారిలో ముంబై నుంచే 26 మంది ఉన్నట్లు పేర్కొంది. 32 మందిలో 25 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారని, అందులో 50 శాతం మంది షుగర్, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి అనారోగ్యాలతో పోరాడుతున్నవారేనని వెల్లడించింది. అంతకుముందు రోజు మంగళవారం కూడా 31 మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 432కు చేరింది. రాష్ట్రంలో బుధవారం రాత్రి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,951 కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న 205 మందిని బుధవారం డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1,593 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

Latest Updates