కేరళలో మరో 5కరోనా కేసులు

కేరళలో మరోసారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ఈ సారి ఐదుగురికి కరోనా పాజిటీవ్ వచ్చినట్టు.. కేరళ హెల్త్ మినిస్టర్ శైలజ తెలిపారు. ఇటీవల ఇటలీ నుంచి పతనంతిట్టకు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటీవ్ వచ్చిందన్నారు. వీరి నుంచి మరో ఇద్దరికి వైరస్ వ్యాపించిందని చెప్పారు.  దేశంలో మొట్టమొదటి కరోనా కేసు గత నెల కేరళలోనే నమోదైంది. ఐతే… ముగ్గురు వైరస్ పాజిటివ్ పేషెంట్లకు కొవిడ్ ను నయం చేసి ఇంటికి పంపించారు కేరళ డాక్టర్లు. లేటెస్ట్ గా వైరస్ గుర్తించిన ఐదుగురు పేషెంట్లను కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

 

Latest Updates