ప్రతీరోజు నరకయాతన: కరోనా సోకిన అమ్మాయి

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ ( కోవిడ్ – 19 ) తో అతలాకుతలం అవుతుంది. ఈ వైరస్ బారిన పడ్డవారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అయితే అమెరికాకు చెందిన 22ఏళ్ల అమీ షిర్చెల్ అనే యువతి కరోనా బారినపడగా…  ఆమె తన బాధలను సోషల్ మీడియాలో పంచుకుంది.  తాను అనుభవిస్తున్న బాధలు వినైనా ప్రజలు రోడ్లపై తిరగడం ఆపేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.

తాను యూరప్ టూర్ పూర్తి చేసుకుని అమెరికాకు చేరుకున్న రెండవ రోజునుంచి జ్వరం, సర్ది, తలనొప్పి, చలి, ముక్కు కారటం మైల్డ్ గా స్టార్ట్ అయ్యాయని చెప్పింది అమీ షిర్చెల్. దీంతో తాను కరోనా టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్ కు వెళ్లానని తెలిపింది. రిపోర్ట్ రావడానికి టైం పడుతుండటంతో తిరిగి ఇంటికి చేరుకున్నానని చెప్పింది. అయితే కరోనాతో ప్రతీ రోజు తనకు జరిగిన బాధగురించి వివరంగా తెలిపింది.

మూడవ రోజు…  తాను ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడ్డానని.. రోజు మొత్తం వాంతులు అయ్యాయని తెలిపింది అమీ షిర్చెల్. నిద్రకూడా పట్టలేదని చెప్పింది. అయితే తనకు కరోనా వైరస్ సోకిందా లేదా అనేది అప్పటికి తెలియలేదని రిపోర్ట్ కోసం హాస్పిటల్ కు వెళ్లడానికి కూడా శక్తి లేకుండా అయ్యిందని తెలిపింది.

నాలుగవ రోజు… తనకు  శ్వాస పీల్చుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని తెలిపింది. ఊపిరి తిత్తులలో పెద్ద రంద్రం పడ్డట్టుగా అనిపించిందని శ్వాస తీసుకున్నా అందలేదని చెప్పింది. అప్పటికే తనకు జ్వరం 102 డిగ్రీలు వచ్చిందని తెలిపింది అమీ షిర్చెల్.

ఐదవరోజు… తన పరిస్థితి మరింత దిగజరిపోయిందని చెప్పింది అమీ షిర్చెల్. తన జీవితంలో ఎప్పుడూ ఇంతగా బాధపడలేదని తెలిపింది. తనకు చనిపోతానన్న భయం వెంటాడిందని చెప్పింది.

ఆరవరోజు… రోగ లక్షణాలతో తాను నడలేకపోయానని వాంతులతో సతమతమయ్యానని తెలిపింది అమీ షిర్చెల్. బాత్ రూంకు వాంతి చేసుకోవడానికి వెళ్తూ పడిపోగా 911కు అతి కష్టం మీద కాల్ చేశానని చెప్పింది. దీంతో 911 సిబ్బంది వచ్చి తనను హాస్పిటల్ కు తీసుకెళ్లారని అప్పటినుంచి చికిత్స మొదలైందని తెలిపింది.

7 నుంచి 11రోజులు… ఈ ఐదు రోజులు హస్పిటల్ లో తాను దయనీయంగా ఉన్నానని తెలిపింది అమీ షిర్చెల్. జ్వరం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలాగే ఉందని చెప్పింది. అయితే హాస్పిటల్ సిబ్బంది తనకు చేస్తున్న చికిత్స కొనసాగుతుందని తెలిపింది.

ప్రస్తుతం తనకు కరోనా వైరస్ సోకి 12రోజుల అవుతుందని … అయితే తనకు ఇంకా వైరస్ తగ్గలేదని చెప్పింది. తనకు వచ్చిన ఈ బాధ శత్రువుకు కూడా రాకూడదని తెలిపింది. ఇంట్లో ఉన్న వాళ్లు సురక్షితంగా ఉండాలని బయటతిరగకూడదని కోరింది అమీ షిర్చెల్.

Latest Updates