కుక్కల నుంచి కరోనా రాదు

కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువుల నుంచి కరోనా వైరస్ మనుషులకు సోకదని హెల్త్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ పర్ట్ లు వెల్లడించారు. అయితే మనుషుల నుంచి పెంపుడు జంతువులకు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. హాంకాంగ్ అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ కన్జర్ వేషన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో జరిగిన రీసెర్చ్ లో ఈ విషయం వెల్లడైంది. హాంకాంగ్ లో ఇప్పటికే ఓ పెంపుడు కుక్కకు కరోనా సోకింది. కోవిడ్-19 బాధితురాలైన ఓనర్ నుంచే  పెట్ డాగ్ కు సోకిందని నిపుణులు తేల్చారు. అక్కడి ప్రభుత్వం ఆ డాగ్ ను వెంటనే క్వారంటైన్ కు  పంపించి టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. అయితే ‘వీక్ పాజిటివ్’ లక్షణాలున్నట్లు మాత్రమే తేలింది. ఈ నేపథ్యం లో పెంపుడు జంతువులే వైరస్ వ్యాప్తికి మూలమని చెప్పేందుకు ఆధారాలు లేవని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

ప్రస్తుతం కరోనా సోకిన డాగ్ కు లో లెవల్ ఇన్ఫెక్షనే ఉందని హాంకాంగ్ వర్సిటీ సైంటిస్టులు తెలిపారు. కరోనా గబ్బిలాల నుంచి జంతువులకు సోకి ఉంటుందని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. అడవి క్షీరదాల నుంచి మనుషులకు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. పెట్స్ ను క్వారంటైన్ కు పంపండి..ఎవరికైనా కరోనా సోకితే వారు కచ్చితంగా తమ పెట్స్ నుంచి  క్వారంటైన్ కు పంపించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఓనర్ కు కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే పెట్స్ నూ క్వారంటైన్ చేయాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పెట్ ఓనర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెట్స్ కు సంబంధించిన పనులు చేసిన తర్వాత తప్పని సరిగా హ్యాండ్‌ వాష్​ చేసుకోవాలన్నారు. పెట్స్ కు ముద్దు ఇవ్వడం లాంటివి చేయొద్దన్నారు. ఓనర్స్ కు అనారోగ్యంగా ఉంటే పెట్స్ కు  దూరంగా ఉండడం బెటరని అన్నారు. పెట్స్ హెల్త్ కండీషన్స్ లో చేంజెస్ ఉంటే వెంటనే వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.

Latest Updates