మూడు రోజులు కరోనా కాలర్ ట్యూన్

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌‌‌పై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం  కాలర్‌‌‌‌ ట్యూన్స్‌‌‌‌ను వాడుకుంటోంది. టెలికాం కంపెనీలు డీఫాల్ట్‌‌‌‌ కాలర్‌‌‌‌‌‌‌‌ ట్యూన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో  30 సెకన్ల నిడివుండే కరోనా ఏవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ ఆడియోని వినిపిస్తున్నాయి.  బీఎస్‌‌‌‌ఎన్ఎల్‌‌‌‌, రిలయన్స్‌‌‌‌ జియో, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, వొడాఫోన్‌‌‌‌ ఐడియా తమ డీఫాల్ట్‌‌‌‌ కాలర్‌‌‌‌‌‌‌‌ ట్యూన్‌‌‌‌ను ఈ ఆడియోతో భర్తీ చేశాయని డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కమ్యూనికేషన్స్‌‌‌‌(డీఓటీ) శనివారం తెలిపింది.  కాగా కరోనాపై ప్రజలలో అవగాహన కలిగించేందుకు  డీఫాల్ట్‌‌‌‌ కాలర్‌‌‌‌ ట్యూన్‌‌‌‌ను మార్చాలని ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ టెలికాం శాఖను కోరింది. దీనికి సంబంధించి డాట్‌‌‌‌ శుక్రవారం టెలికాం కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది. కరోనా వైరస్‌‌‌‌పై అవగాహన కలిగించేందుకు 30 సెకన్ల నిడివుండే ప్రి కాల్‌‌‌‌ ఆడియోను డెవలప్ చేశామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది మూడు రోజుల వరకు డీఫాల్ట్‌‌‌‌ కాలర్‌‌‌‌‌‌‌‌ ట్యూన్‌‌‌‌గా ఉంటుందని పేర్కొంది. దీంతోపాటు కరోనాకు సంబంధించి ఏం చేయాలి, ఏం చేయకూడదో చెప్పే బల్క్‌‌‌‌ మెసెజ్‌‌‌‌లను కూడా కస్టమర్లకు పంపించాలని టెలికాం కంపెనీలను అడుగుతామని తెలిపింది.

Latest Updates