మూడింటితో కరోనాకు చెక్‌.. బెంగళూరు పోలీసుల క్రియేటివ్ పోస్ట్‌

బెంగళూరు: కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరస్‌పై అవగాహన కోసం బెంగళూరు సిటీ పోలీసులు క్రియేటివ్‌గా ఓ పోస్ట్ పెట్టారు. తెలివైన మూడు వ్యూహాలతో కరోనాపై గెలవాలని ట్విట్టర్‌‌లో ఫొటో పోస్ట్‌ చేశారు. మూడు వైపుల ఉన్న డైస్‌కు ఒక సైడ్ శానిటైజర్, మరోవైపు సోషల్ డిస్టెన్సింగ్, ఇంకోవైపు మాస్కు అని రాసి, గుర్తులు ఉండే ఫొటోను రూపొందించారు. కరోనాను అరెస్ట్ చేయండంటూ మెసేజ్ ఇచ్చారు. ‘అందరూ తమ ఇళ్లకు జాగ్రత్తగా చేరుకుంటారని ఆశిస్తున్నాం. ఇది కేవలం జాగ్రత్తలు తీసుకుంటేనే సాధ్యమవుతుంది. అరెస్ట్‌ కరోనా’ అనే క్యాప్షన్‌తో బెంగళూరు సిటీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్‌ పెట్టింది.

Latest Updates