పాకిస్తాన్ లో 20 వేలు దాటిన వైరస్ కేసులు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజులోనే 1,083 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,186 కు చేరుకుందని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 22 మంది చనిపోగా.. మొత్తం మరణాలు 462 కు పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,590 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్ లో 7,524, సింధ్ 7,465, ఖైబర్- పఖ్తున్క్వా 3,129, బలూచిస్తాన్ 1,218, ఇస్లామాబాద్ 415, గిల్గిట్-బాల్టిస్తాన్ 364, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ 71 కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

 

Latest Updates