ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా .. గడిచిన 24గంటల్లో 7,738 మందికి సోకిన వైరస్

ఏపీలో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 7,738 మందికి కరోనా సోకగా.. 57మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 5,359మంది మృతి చెందారు. ఇక కరోనా రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,25,514కు కరోనా కేసులు నమోదు కాగా అందులో 5,41,319మంది కోలుకున్నారు.

జిల్లాల వారీగా కృష్ణా జిల్లాలో – 8, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో –7 ప్రకాశం, విశాఖ జిల్లాల్లో –6 తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో – 4 కడప, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో – 3, గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో – ఇద్దరు చొప్పున మృతి చెందారు.

Latest Updates