20ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఇండియాలో క‌రోనా కేసులు 20 లక్షలు దాటిపోయినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇండియాలో ఇప్పటి వరకు 20,21,407 కేసులు నమోద‌య్యాయి. 42వేల మంది మ‌ర‌ణించారు.
దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ అత్య‌ధికంగా ఉన్న దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో ఉంది. అమెరికా 49.91 లక్షల కేసులతో మొదటిస్థానంలో ఉండగా, 28.73 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. ఆ రెండు దేశాల త‌రువాత 20,21,407 కేసుల‌తో భార‌త్ మూడో స్థానంలో ఉంది.

Latest Updates