తెలంగాణలో 18కి చేరిన కరోనా కేసులు

లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య 18కి చేరింది. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో నివసించే ఒక్కరికి కూడా కరోనా సోకలేదని, విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా సోకినట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఐఎంఏ ప్రయత్నించాలని కోరారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వ్యాధిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Latest Updates